: సర్జరీలు చేస్తుండగా పవర్ కట్.. టార్చిలైట్ల వెలుగులో కొనసాగించిన వైద్యులు
ఆపరేషన్ థియేటర్లలో ఇద్దరు మహిళలకు సర్జరీలు చేయడంలో వైద్యులు బిజీగా ఉన్నారు. దాదాపు సగం పూర్తికావచ్చింది. ఇంతలో పవర్ కట్. ఆపరేషన్ థియేటర్లలో చిమ్మ చీకటి అలముకుంది. జనరేటర్ ఆన్ చేయాల్సిన ఆపరేటర్ ఆ చుట్టుపక్కల కనిపించలేదు. దీంతో ఏం చేయాలో తెలియని వైద్యులు టార్చిలైట్ల వెలుగులో శస్త్రచికిత్స కొనసాగించాల్సి వచ్చింది. అదృష్టవశాత్తు ఆపరేషన్లు విజయవంతంగా ముగియడంతో వైద్యులు ఊపిరి పీల్చుకున్నారు. గ్వాలియర్ లోని కమలరాజ ఆస్పత్రిలో మంగళవారం జరిగిందీ ఘటన. 15 నిమిషాల అనంతరం విద్యుత్ ను పునరుద్ధరించినట్టు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జేఎస్ శికార్ వర్ తెలిపారు.