: క్రికెట్ అనుభవాలను అక్షరీకరించిన సౌరవ్ గంగూలీ


టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తన క్రికెట్ అనుభవాలకు అక్షరరూపమిచ్చాడు. క్రికెట్ లో విజేతగా నిలిచేందుకు తాను ఎదుర్కొన్న సవాళ్లు, చేసిన పోరాటం, పోరాడే తత్త్వం, దూకుడుగా ముందుకు వెళ్లడం, ప్రేరణ పొందే విధానం, డ్రెస్సింగ్ రూమ్ లో గడిపిన క్షణాలు మొదలైన విషయాలను గంగూలీ తాను రాసిన ‘ఏ సెంచురీ ఈజ్ నాట్ ఇనఫ్’ అనే పుస్తకంలో పేర్కొన్నాడు. ఈ పుస్తకాన్ని కోల్ కతాలో ఈ రోజు ఆవిష్కరించారు. సీనియర్ పాత్రికేయుడు గౌతమ్ భట్టాచార్యతో కలిసి ఈ పుస్తకాన్ని సౌరవ్ రాశాడు. త్వరలోనే మార్కెట్లోకి రానున్న ఈ పుస్తకం పలువురికి ప్రేరణ కల్పించే విధంగా ఉందని ప్రచురణ కర్తలు అంటున్నారు.

  • Loading...

More Telugu News