: నిన్న ప్రారంభమైన సూపర్ ఫాస్ట్ రైలు ఇవాళ రద్దయింది!
నవ్యాంధ్ర ఉద్యోగుల కోసం విజయవాడలో నిన్న ప్రారంభించిన సూపర్ ఫాస్ట్ రైలు ఇవాళ రద్దయింది. విజయవాడ- సికింద్రాబాద్ మధ్య ప్రవేశపెట్టిన ఇంటర్ సిటీ సూపర్ ఫాస్ట్ రైలును రైల్వే మంత్రి సురేశ్ ప్రభు, సీఎం చంద్రబాబు నిన్న జెండా ఊపి ప్రారంభించారు. అయితే, ఈ ప్రత్యేక రైలును ఈరోజు రద్దు చేసినట్లు రైల్వే శాఖ తెలిపింది. దీనిని త్వరలో క్రమబద్ధీకరిస్తామని అధికారులు పేర్కొన్నారు. కాగా, హైదరాబాద్ నుంచి నవ్యాంధ్ర రాజధాని అమరావతికి వచ్చే ఉద్యోగులుకు వీలుగా ఈ కొత్త రైలును రైల్వే శాఖ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.