: రేపటి మ్యాచ్ లో విజయంపై దృష్టి పెట్టిన భారత్, జింబాబ్వే


జింబాబ్వే పర్యటన సందర్భంగా వన్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా టీ20 సీరిస్ ను చేజిక్కించుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. వన్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన భారత జట్టు తొలి టీ20లో అలసత్వం ప్రదర్శించింది. దీంతో జింబాబ్వేయన్లు జూలు విదిల్చారు. భారీ స్కోరు సాధించడమే కాకుండా భారత్ కు ఊహించని షాకిచ్చారు. దీంతో తేరుకున్న ధోనీ సేన జరిగిన తప్పిదాన్ని తెలుసుకుంది. వెంటనే తేరుకుని రెండో టీ20 మ్యాచ్ ను చేజిక్కించుకుని తిరిగి రేసులో నిలబడింది. మూడో టీ20ని కూడా గెలుచుకుని సిరీస్ సాధించి, తన కెప్టెన్సీలో పదును తగ్గలేదని నిరూపించుకునేందుకు ధోనీ సిద్ధమవుతున్నాడు. ఇదే సమయంలో భారత్ ను తొలి టీ20 మ్యాచ్ లో ఓడించిన జింబాబ్వే మానసిక స్థైర్యం పెంచుకుంది. దీంతో ఈ మ్యాచ్ లో నెగ్గి భారత్ కు మరోసారి షాకిచ్చి, టీ20 సిరీస్ ను గెలుచుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది. దీంతో రెండు జట్లు వ్యూహ, ప్రతి వ్యూహాలు రచించుకోవడంలో మునిగిపోయారు. కాగా, టాస్ ఎవరు గెలిచినా జింబాబ్వే బ్యాటింగ్ ప్రారంభించే అవకాశం కనిపిస్తోంది.

  • Loading...

More Telugu News