: ప్రజాకవి కవి, రచయిత గూడ అంజయ్య కన్నుమూత


తెలంగాణ రచయితగా, గాయకుడిగా, ప్రజా ఉద్యమ కారుడిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన గూడ అంజయ్య(61) ఈరోజు కన్నుమూశారు. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజిల్ పరిధి రాగన్నగూడెంలోని త‌న స్వ‌గృహంలో ఆయ‌న తుది శ్వాస విడిచారు. కొంత కాలంగా ఆయన గుండె జబ్బు, పక్షవాతంతో బాధపడుతూ నిమ్స్ లో చికిత్స పొందుతోన్న సంగతి తెలిసిందే. గూడ అంజయ్య 1955లో ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం లింగాపురంలో జన్మించారు. ఆయ‌న రాసిన‌ "ఊరు మనదిరా" పాట 16 భాషలలో అనువాదమయింది. "నేను రాను బిడ్డో మ‌న ఊరి ద‌వాఖాన"కు అనే పాట తెలంగాణలో సర్కారీ దవాఖానాల దుస్థితిని ఎండగట్టింది. ఆయన రాసిన ఇటువంటి పాటలు ఎన్నో తెలంగాణ వాసుల గొంతుల్లో ప్రతీరోజూ ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. గూడ అంజయ్య తెలంగాణ సాంస్కృతిక సంఘ నాయకునిగా పనిచేశారు. నలభై ఏళ్లుగా తెలంగాణ సాహితీ ప్రపంచంలో సేవలందించిన అంజయ్య కలకాలం నిలిచిపోయే పాటలు ఎన్నో రాశారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా ఆయ‌న రాసిన పాట‌లు పోరాటానికే కొత్త ఊపిరులూదాయి. తెలంగాణ మొదటి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ఉత్తమ కవి అవార్డును ఆయన అందుకున్నారు.

  • Loading...

More Telugu News