: హిందూపురంలో రహదారిపై పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మహిళ
రహదారిపై ఓ గర్భిణీ పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఘటన అనంతపురం జిల్లా హిందూపురంలో ఈరోజు చోటుచేసుకుంది. నిండు గర్భిణీగా ఉన్న మహిళ రహదారిపై నొప్పులతో బాధపడుతూ కనిపించగా స్థానికులు అక్కడే ఆమె ప్రసవం అయ్యేందుకు సాయం చేసినట్లు తెలుస్తోంది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. ప్రసవం అనంతరం తల్లీబిడ్డలను 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు.