: టీడీపీ నేత ఆనం వివేకాపై ముస్లిం మతపెద్ద మండిపాటు
ముస్లిం మతస్తులను కించపరిచేలా టీడీపీ నేత ఆనం వివేకానందరెడ్డి మాట్లాడుతున్నారంటూ నెల్లూరులో ముస్లిం మతపెద్ద అబూబకర్ మండిపడ్డారు. మేయర్ అబ్దుల్ అజీజ్ పై వివేకా అసత్య ఆరోపణలు చేశారన్నారు. అజీజ్ నిజాయతీపరుడని, లక్ష సంతకాలు సేకరించి సీఎం చంద్రబాబుకు పంపుతామన్నారు. ‘హడీ నవాబ్’ అని వ్యాఖ్యానించిన వివేకా ముస్లింల ఓట్లతోనే గతంలో ఎమ్మెల్యే పదవి దక్కించుకున్నారని, ఆ విషయాన్ని ఆయన గుర్తుంచుకోవాలని అబూబకర్ హితవు పలికారు.