: తెలంగాణ అభివృద్ధిలో కేటీఆర్‌ది ముఖ్యపాత్ర: దత్తాత్రేయ
తెలంగాణ అభివృద్ధిలో రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ది ముఖ్యపాత్ర అని కేంద్రమంత్రి దత్తాత్రేయ అన్నారు. ఈరోజు ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రాభివృద్ధికి కేటీఆర్ చేస్తోన్న కృషి ప్రశంసనీయమని అభినందించారు. మెట్రో నిర్మాణాన్ని త్వరలోనే పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌ను వై-ఫై జోనుగా మార్చుతామని చెప్పారు. సిరిసిల్లలో బీడీ కార్మికుల కోసం 100పడకల ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. రాజకీయ విమర్శలకు స్పందన, ప్రతిస్పందన ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో విమర్శలు సాధారణమేనని ఆయన అన్నారు. కేంద్రం, రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం అవసరమని పేర్కొన్నారు.