: ప్రారంభమైన టీమిండియా కోచ్ ఇంటర్వ్యూలు...రేసులో ఐదుగురు మాజీ టీమిండియన్లు


టీమిండియా కోచ్ ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. కోల్ కతాలోని ఓ స్టార్ హోటల్ లో గంగూలీ, లక్ష్మణ్ లు ఇంటర్వ్యూ నిర్వహిస్తుండగా, లండన్ నుంచి సచిన్ టెండూల్కర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారితో జత కలిశాడు. కాగా, వడపోత కార్యక్రమం ముగియగా, రేసులో ఐదుగురు మాజీ టీమిండియన్లు మిగిలి ఉన్నారు. వారిలో టీమిండియా డైరెక్టర్ రవిశాస్త్రి, చీఫ్ సెలెక్టర్ సందీప్ పాటిల్, టీమిండియా మాజీ మేనేజర్ రాజ్ పుత్, ప్రవీణ్ ఆమ్రే దరఖాస్తు చేసి రేసులో ఉండగా, బీసీసీఐ సూచన మేరకు, జట్టు ప్రయోజనాల కోసం కుంబ్లే పేరును కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. వీలైనంత త్వరలో ఇంటర్వ్యూలు పూర్తి చేసి, కోచ్ పై నివేదికను ఈ ముగ్గురూ బీసీసీఐకి అందజేయనున్నారు.

  • Loading...

More Telugu News