: లష్కర్ కమాండర్ అరెస్టుతో ప్రారంభమైన భారీ ఎన్ కౌంటర్


జమ్మూకశ్మీర్‌ లోని కుప్వారా జిల్లాలో భద్రతా దళాలు లష్కరే తోయిబాకు చెందిన కమాండర్‌ ను అరెస్టు చేశాయి. కుప్వారాలోని లోలబ్‌ ప్రాంతంలోని సొగమ్‌ మార్కెట్లో పోలీసు బృందం అబూ ఉకాషాను అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి ఒక గ్రనైడ్‌, 38 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. అతనిని పట్టుకుని ప్రాథమిక దర్యాప్తు చేసిన తరువాత, అతను లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదిగా అధికారులు గుర్తించారు. అనంతరం మరింత లోతుగా విచారణ జరిపి అతను పాకిస్థాన్ కు చెందిన అబూ ఉకాషా అలియాస్‌ హన్జుల్లా అని ధ్రువీకరించారు. అతనిని అరెస్టు చేసిన గంట తరువాత సొగామ్‌ అడవిలో భారీ ఎన్‌కౌంటర్‌ ప్రారంభం కావడం విశేషం.

  • Loading...

More Telugu News