: యోగా దినోత్సవ బహిష్కరణ, మ్యూజిక్ డే నిర్వహణ.. బీహార్ ప్రభుత్వ నిర్ణయం
ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు రెండవ యోగా దినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటోన్న సంగతి తెలిసిందే. యోగాకి పుట్టినిల్లయిన భారత్‌లోని అన్ని రాష్ట్రాల్లో యోగా కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అయితే బీహార్ ప్రభుత్వ నేతలు మాత్రం నేటి యోగా దినోత్సవాన్ని బహిష్కరించారు. కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆధ్వర్యంలో ఈరోజు పాట్నాలో యోగా దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. అయితే, ఈ కార్యక్రమానికి బీహార్ మంత్రులెవరూ హాజరుకాలేదు. తాము బీహార్‌లో విధించిన మద్యపాన నిషేధానికి తమకు బీజేపీ నేతల నుంచి సానుకూల స్పందన రాలేదని, అందుకే తాము ఈరోజు నిర్వహించిన యోగా కార్యక్రమంలో పాల్గొనలేదని జేడీయూ తెలిపింది. అయితే తాము నేటి వరల్డ్ మ్యూజిక్ డేను మాత్రం ఘనంగా నిర్వహించనున్నట్లు పేర్కొంది.