: ఒత్తిళ్లతో ఇష్టానుసారంగా బదిలీలు చేస్తే ప్రభుత్వానికే చెడ్డపేరు: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వోద్యోగుల బదిలీలపై ఈరోజు విజయవాడలోని తన కార్యాలయం నుంచి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బదిలీల ప్రక్రియను జిల్లాల వారీగా ఆయన సమీక్షించారు. ప్రభుత్వ పాలనలో ఉత్తమ బృందాల ఎంపిక కోసమే బదిలీలు చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రతి ఉద్యోగితో పని చేయించుకోవాలంటే బదిలీలు తప్పవని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేసేందుకు ఆసక్తి చూపే ఉద్యోగులకు మంచి ప్రోత్సాహకాలు ఇస్తామని ఆయన తెలిపారు. ఒత్తిళ్లతో ఇష్టానుసారంగా బదిలీలు చేస్తే ప్రభుత్వానికే చెడ్డపేరు వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. బదిలీ మార్గదర్శకాలను కచ్చితంగా అనుసరించాలని ఆయన సూచించారు.