: కర్ణాటక మంగళూరులో రోడ్డు ప్రమాదం.. 8 మంది స్కూలు విద్యార్థులు మృతి
కర్ణాటక మంగళూరు సమీపంలోని కుందాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కుందాపూర్ వద్ద ప్రయాణిస్తోన్న ఓ పాఠశాల వ్యాన్, ప్రైవేటు బస్సు పరస్పరం ఢీ కొన్నాయి. ప్రమాదంలో ఎనిమిది మంది విద్యార్థులు మృతి చెందారు. మరో పది మందికి తీవ్రగాయాలయ్యాయి. మృతి చెందిన వారిని క్రాసిలోని డాన్‌బాస్కో పాఠశాల విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. ఉడిపిలోని మణిపాల్ వైద్యశాలకు క్షతగాత్రులను తరలించారు. ప్రమాద ఘటనకు సంబంధించి మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది. విద్యార్థుల మృతితో వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.