: ఎల్బీనగర్‌లోని ప్రైవేట్ స్కూల్లో దారుణం.. ఐదేళ్ల చిన్నారితో సెక్యూరిటీ గార్డ్ అసభ్య ప్రవర్తన
ఐదేళ్ల చిన్నారిపై ఓ సెక్యూరిటీ గార్డ్ అసభ్యంగా ప్రవర్తించిన దారుణ ఘటన హైదరాబాద్ శివారులోని ఎల్బీనగర్‌లో చోటుచేసుకుంది. తమ కూతురిపై సెక్యూరిటీ గార్డ్ అసభ్యంగా ప్రవర్తించాడని ఆ చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకి ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకొచ్చింది. ఎల్బీనగర్‌లోని ఓ ప్రైవేటు స్కూల్లో తమ చిన్నారి చదువుకుంటోందని, తమ కూతురిపై ఆ స్కూలు సెక్యూరిటీ గార్డ్ అసభ్యంగా ప్రవర్తించాడని ఎల్బీనగర్ పోలీసులకి ఆ చిన్నారి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసునమోదు చేసుకున్న పోలీసులు సెక్యూరిటీ గార్డును అదుపులోకి తీసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.