: హైదరాబాద్ నుంచి వెళ్లిపోయిన ఏపీఎస్ఆర్టీసీ... కార్గోలో సరంజామా!


హైదరాబాద్ నుంచి సేవలందిస్తున్న ఏపీఎస్ ఆర్టీసీ నవ్యాంధ్రకు తరలివెళ్లింది. ఈ ఉదయం కార్గోలో కార్యాలయానికి చెందిన సమస్త సరంజామానూ కార్గోల్లో సర్దిన అధికారులు వాటిని విజయవాడకు పంపించారు. ఆర్టీసీతో పాటు ఎక్సైజ్ విభాగం కూడా తన సామాను సర్దేసి అమరావతికి తరలింది. ఈ నెల 27వ తేదీలోపు 15 విభాగాలు ఏపీకి వెళ్లిపోతాయని, మిగతా విభాగాలు దశలవారీగా తరలుతాయని ఉన్నతాధికారులు వివరించారు. ఇక్కడి నుంచే ఆఫీసు పనులకు రావాలని భావించే వారి కోసం నూతన రైలు సేవలందించేందుకు సిద్ధంగా ఉందని, దాన్ని వినియోగించుకోవాలని కోరారు.

  • Loading...

More Telugu News