: యోగాని వివాదాస్పదం చెయ్యొద్దు: మోదీ
యోగా అనేది దేశ జీవన విధానమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. చండీగఢ్‌లో యోగా డే సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రజలతో కలసి యోగాసనాలు వేసిన మోదీ అనంతరం ప్రసంగించారు. మానసిక ఏకాగ్రత యోగా వల్లే సాధ్యమని ఆయన అన్నారు. యోగా సాధనతో బుద్ధి, మనసు వికాసం చెందుతాయని, శరీరం బలంగా తయారవుతుందని ఆయన పేర్కొన్నారు. ఆస్తికులు, నాస్తికులు అందరికీ యోగా అవసరమని ఆయన చెప్పారు. యోగా ప్రోత్సాహకానికి ఈ ఏడాది పురస్కారాలు అందజేస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు. ప్రపంచమంతా యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటోందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. యోగా ఏదో ఓ మతానికి సంబంధించినది కాదని, దానిని వివాదాస్పదం చెయ్యొద్దని ఆయన సూచించారు.