: కేజ్రీవాల్ ఇంటి ముందే బీజేపీ ఎంపీ మహేశ్ గిరీ యోగాసనాలు
బీజేపీ ఎంపీ మహేశ్ గిరీ ప్రపంచ రెండవ యోగా దినోత్సవం సందర్భంగా ఈరోజు ఉదయం ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇంటి ముందే యోగా చేశారు. ఢిల్లీలో జరిగిన ఓ హత్య కేసులో తనపై కేజ్రీవాల్ అనవసర ఆరోపణలు చేస్తున్నారని ఆయన రెండు రోజుల క్రితం అక్కడ దీక్షకు దిగిన విషయం తెలిసిందే. తనపై చేసిన ఆరోపణలను కేజ్రీవాల్ రుజువు చెయ్యాలని ఆయన డిమాండ్ చేశారు. నేడు ప్రపంచ వ్యాప్తంగా యోగా డే ను నిర్వహిస్తోన్న సందర్భంగా ఆయన కూడా దీక్ష చేస్తోన్న వేదికపైనే యోగాసనాలు వేశారు. తనతో పాటు ఆయనకు సంఘీభావం తెలుపుతోన్న పలువురు నేతలు దీక్ష వేదికపై యోగాసనాలు వేశారు.