: ఐదు నిమిషాల్లో ఇల్లు నిర్మాణం పూర్తి...అబ్బురపరుస్తున్న స్టార్టప్


పెళ్లి చేసుకుని, ఇల్లు చూసుకుని చల్లగ కాలం గడపాలోయ్ అని ఓ సినీ కవి చెప్పాడు. ఆయన చెప్పినట్టు ఇల్లు కట్టుకోవాలంటే తలకు మించిన భారమవుతోంది. ఇసుక దగ్గర్నుంచి అన్నీ కొనుక్కోవాల్సిందే. దీంతో ఓ ఇల్లు నిర్మించడం ప్రయాసతో కూడుకున్నదే కాకుండా, చేతి చమురు కూడా భారీ ఎత్తున వదిలించుకోవాల్సి వస్తోంది. దీనికి చరమగీతం పాడాలని ఓ స్టార్టప్ కంపెనీ భావించింది. దీంతో సరికొత్త ఇళ్ల నిర్మాణానికి తెరతీసింది. ఆస్ట్రేలియాలోని హ్యూమనీహట్ సంస్థ సరికొత్త ఇళ్లను రూపొందించింది. కేవలం ఐదు నిమిషాల్లో ఇంటిని తయారు చేసి అందజేయనుంది. పిండికొద్దీ రొట్టె అన్నట్టు...మీరు పెట్టిన ఖర్చును అనుసరించే ఆ ఇంట్లో సౌకర్యాలు కూడా కల్పించనున్నారు. ఈ ఇల్లు ప్రకృతి విపత్తులు, శరణార్ధులకు ఆశ్రయం కల్పించడం వంటి సమయాల్లో బాగా అక్కరకు వస్తాయని రూపకర్తలు చెబుతున్నారు. ఈ ఇల్లు ఎలా ఉంటాయో తెలుసుకోవాలనుకుంటే మీరు కూడా ఓ సారి చూడండి.

  • Loading...

More Telugu News