: సెయింట్ ఆండ్రూస్ స్కూలుపై ఎలాంటి ఫిర్యాదులు లేవు: విద్యాశాఖాధికారులు


సికింద్రాబాదులోని సెయింట్ ఆండ్రూస్ స్కూలుపై తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన విద్యాశాఖాధికారులు తనిఖీలకు వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సెయింట్ ఆండ్రూస్ స్కూలుపై ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదులు లేవని అన్నారు. తొలిసారి ఫిర్యాదు తమకు అందిందని, నిజానిజాలు నిర్ధారించేందుకు ఎంఈవోలతో కూడిన కమిటీతో స్కూలుకు వచ్చామని తెలిపారు. సాధారణంగా కఠిన నిబంధనలు ఉన్నప్పటికి విద్యార్థుల అవసరం మేరకు వీలైన సందర్భాల్లో సడలింపు ఉంటుందని, ఏ యాజమాన్యం విద్యార్థులను హింసించాలని చూడదని, వారిని ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దడంలో భాగంగా కఠినంగా వ్యవహరిస్తుందని వారు పేర్కొన్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదులో వాస్తవాలు కనిపిస్తే చర్యలు తీసుకునేందుకు సిధ్ధమని అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు నినాదాలు చేస్తూ, నిరసన తెలిపారు.

  • Loading...

More Telugu News