: అమరావతి అమ్మకానికి కుదుర్చుకున్న ఆ రహస్య ఒప్పందాన్ని బయటపెట్టండి: వైకాపా


నవ్యాంధ్ర రాజధాని అమరావతిని చంద్రబాబు సర్కారు అమ్మకానికి పెట్టిందని ఆరోపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సింగపూర్ కంపెనీలతో అందుకు సంబంధించి ప్రభుత్వం సీక్రెట్ డీల్ కుదుర్చుకుందని, దాన్ని వెంటనే బహిర్గతం చేయాలని డిమాండ్ చేసింది. రాష్ట్ర ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారని, అమరావతి ప్లాట్ల విభజనపై శ్వేతప్రతాన్ని విడుదల చేయాలని పార్టీ ఎస్సీ సెల్ విభాగం మేరుగ నాగార్జున డిమాండ్ చేశారు. రాజధాని ప్రాంతంలో జరుగుతున్నది ఏంటో భూములిచ్చిన రైతులకు కూడా తెలియడం లేదని, భూముల కేటాయింపు సక్రమంగా సాగడం లేదని ఆయన ఆరోపించారు. విదేశీ కంపెనీలకు అమరావతిని చంద్రబాబు అమ్మేస్తున్నారని, ప్రజల నుంచి తీసుకున్న 33 వేల ఎకరాల్లో ఇప్పటివరకూ ఎంత అభివృద్ధి చేశారన్న విషయాన్ని బాబు సర్కారు వెల్లడించాలని అన్నారు.

  • Loading...

More Telugu News