: జల వివాదం కొలిక్కి వచ్చేనా..? ఢిల్లీలో కృష్ణా నది యాజమాన్య బోర్డు సమావేశం
రాష్ట్రాల మధ్య తలెత్తుతోన్న జల వివాదాలు, తెలంగాణ చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల అంశంపై ఢిల్లీలో కృష్ణా నది యాజమాన్య బోర్డు సమావేశమయింది. బోర్డు సమావేశానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అధికారులు హాజరయ్యారు. జల వివాదాన్ని పరిష్కరించే అంశాలపై ప్రధానంగా చర్చ జరుగుతున్నట్లు సమాచారం. కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సమావేశం కొనసాగుతోంది. కృష్ణానది యాజమాన్య బోర్డు ఆంధ్రప్రదేశ్‌కు అనుకూలంగా వ్యవహరిస్తోందని తెలంగాణ పలు విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. సమావేశం అనంతరం అధికారులు మీడియాతో పలు విషయాలు వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.