: కేసీఆర్ లక్కీ నంబరే తెలంగాణలో జిల్లాల సంఖ్య!


జాతకాలు, అదృష్ట సంఖ్యలపై అధిక నమ్మకాన్ని చూపే కేసీఆర్ లక్కీ నంబర్ 6 అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక కొత్తగా జిల్లాల విభజన జరగనున్న వేళ, ఈ సంఖ్యకు సంబంధం ఉండేలానే జిల్లాల పెంపు ఉంటుందని తెలుస్తోంది. ఇటీవలి కలెక్టర్ల సమావేశంలో ముసాయిదాలో 23 జిల్లాలను పేర్కొనగా, 2, 3 కలిపితే 5 వస్తుంది. సంఖ్యా శాస్త్రం ప్రకారం 23 సంఖ్య కేసీఆర్ కు కలిసిరాదని భావిస్తున్న అధికారులు, తాజాగా సిరిసిల్లను ఓ జిల్లాగా కలుపుతూ 24 జిల్లాలుగా తెలంగాణను మార్చేలా కొత్త రిపోర్టును తయారుచేసినట్టు తెలుస్తోంది. సిరిసిల్లకు యువనేత కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తుండటమే ఈ జిల్లా చేరికకు అధికారులు ఆసక్తి చూపారని సమాచారం. ఇక 2, 4 కలిపితే 6 వస్తుంది కాబట్టి, అది కేసీఆర్ కు అనుకూల సంఖ్య కాబట్టి తెలంగాణలో జిల్లాల సంఖ్య 24కు చేరుతుందని ఉన్నతాధికారులు అంటున్నారు.

  • Loading...

More Telugu News