: మదర్ థెరిస్సానూ వదలని ఆదిత్యనాథ్!... ‘క్రిస్టియన్ దేశంగా భారత్’ కుట్రలో ఆమెకూ భాగమని ఆరోపణ!


బీజేపీ ఎంపీ ఆదిత్యనాథ్ దాస్ పక్కా హిందూవాది. హిందూ ధర్మ పరిరక్షణ, దేశంలో హిందువుల రక్షణే ప్రధానంగా ఆయన వ్యాఖ్యలు చేస్తుంటారు. ఇప్పటికే పలు సందర్భాల్లో హిందువులకు అనుకూలంగా... ముస్లిం, క్రిస్టియన్ వర్గాలకు వ్యతిరేకంగా ఆయన చేసిన పలు వ్యాఖ్యలు కలకలం రేపాయి. తాజాగా గత శనివారం ఉత్తరప్రదేశ్ లోని బస్తీలో ప్రసంగించిన సందర్భంగా ఆయన సంచలన ఆరోపణ చేశారు. భారత్ లో తన సేవా తత్పరతతో నోబెల్ శాంతి బహుమతి గెలుచుకున్న మదర్ థెరిస్సాను లక్ష్యంగా చేసుకుని కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘భారత్ ను క్రైస్తవ దేశంగా మార్చే కుట్రలో మదర్ థెరిస్సా ఓ భాగం. ఆ సమయంలో జరిగిన ఘటనలే అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, మేఘాలయ, నాగాల్యాండ్ వంటి ఈశాన్య రాష్ట్రాల్లో వేర్పాటు వాద ఉద్యమాలకు ఆజ్యం పోశాయి. ఆ ప్రాంతాల్లో వాస్తవ పరిస్థితుల గురించి మీకు పూర్తిగా తెలియదు. అక్కడి పరిస్థితులను తెలుసుకోవాలంటే ఆ ప్రాంతాలను తప్పనిసరిగా సందర్శించాలి. అలాగే అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని ఎవరూ అడ్డుకోలేరు. బాబ్రీ మసీదును ధ్వంసం చేసినప్పుడు ఆరెస్సెస్ కరసేవకులను ఆపలేకపోయినవారు ఇప్పుడు రామ మందిరం నిర్మాణాన్ని మాత్రం ఎలా అడ్డుకోగలరు?’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News