: సల్మాన్ ఖాన్ చీప్ కామెంట్... నెటిజన్ల మండిపాటు!
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, షాకింగ్ స్టేట్ మెంట్ ఇచ్చి నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలకు గురై, తిట్లు తిట్టించుకుంటున్నాడు. తన తాజా చిత్రం 'సుల్తాన్'లో మల్లయోధుడిగా నటించడంపై అతని అభిప్రాయం కోరగా, బలాత్కారానికి గురైన మహిళలా ఉందని సంచలన వ్యాఖ్యలు చేశాడు. "షూటింగ్ తరువాత రింగ్ నుంచి బయటకు వచ్చినప్పుడు, రేప్ అయిపోయిన మహిళలా అనిపించేది. భయంకరం" అన్నాడు. బరువులు ఎత్తడం తనకు సమస్య కాకపోయినా, నిజంగా యుద్ధం చేయాల్సి రావడంతో చాలా కష్టపడ్డానని చెప్పుకొచ్చాడు. ఇక సల్మాన్ వ్యాఖ్యలపై విమర్శలు ఎదురవుతున్నాయి. అత్యాచార బాధితురాలితో పోల్చుకున్న సల్మాన్ ఏ గౌరవానికీ తగడని, ఆయన పదాలు భయంకరంగా ఉన్నాయని నిప్పులు చెరుగుతున్నారు.