: హైదరాబాదులో ‘అగస్టా’ లింకులు!...‘మెట్ కో’లో ఈడీ తనఖీలు!


కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో పాటు మొత్తం పార్టీనే ఇరుకునపెట్టిన అగస్టా వెస్ట్ ల్యాండ్ కుంభకోణంలో దర్యాప్తు సంస్థలు తీగ లాగే కొద్దీ డొంకలు కదులుతున్నాయి. వీఐపీల కోసమంటూ కొనుగోలు చేసిన హెలికాప్టర్లకు సంబంధించి పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారాయని ఆరోపణలు వినిపించిన ఈ కేసు మూలాలు భాగ్యనగరి హైదరాబాదులోనూ ఉన్నట్లు తేలింది. ఈ మేరకు ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు నిన్న హైదరాబాదులో ముమ్మర సోదాలు చేశారు. ఢిల్లీ, ముంబై మహా నగరాలతో పాటు హైదరాబాదులోనూ అడుగుపెట్టిన ఈడీ అధికారులు.. నగరంలోని ‘మెట్ కో ప్రైవేట్ లిమిటెడ్’ కంపెనీలో సోదాలు చేశారు. అగస్టా కేసులో మధ్యవర్తిగా వ్యవహరించిన వ్యక్తికి సంబంధించి ఈ కంపెనీతో లింకులు ఉన్న నేపథ్యంలోనే ఈ సోదాలు జరిగినట్లు సమాచారం. మరోవైపు ఢిల్లీ, ముంబై నగరాల్లో సోదాలు చేసిన ఈడీ అధికారులు... ఆయా సంస్థలకు చెందిన సుమారు రూ.86 కోట్ల మేర విలువ చేసే షేర్లను స్తంభింపజేశారు.

  • Loading...

More Telugu News