: అమరావతిలో ఎకరా రూ.4 కోట్లు!... నవ్యాంధ్రకు బంపరాఫర్ ఇచ్చిన సింగపూర్ కంపెనీలు!
నవ్యాంధ్ర నూతన రాజధాని కోసం గుంటూరు జిల్లా మంగళగిరి పరిధిలో ప్రభుత్వం సేకరించిన భూములకు రెట్టింపు ధరలు ఇచ్చేందుకు సింగపూర్ సంస్థలు ముందుకు వచ్చాయి. రాజధాని నిర్మాణం, అభివృద్ధి బాధ్యతలను భుజాన వేసుకునేందుకు సింగపూర్ కు చెందిన ప్రముఖ నిర్మాణ రంగ సంస్థలు సెంబ్ కార్ప్, అసెంబాస్ లు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ రెండు సంస్థలు కన్సార్టియంగా ఏర్పడ్డాయి. ఎకరానికి రూ.4 కోట్లు ఇస్తామంటూ ఇటీవల ప్రభుత్వానికి బిడ్ దాఖలు చేశాయి. బహిరంగ మార్కెట్ లోని రేట్ల కంటే రెట్టింపు ధరను ఆ సంస్థలు కోట్ చేయడంతో ఏపీ సర్కారు ఆశ్చర్యానికి గురైంది. ఈ కన్సార్టియం బంపరాఫర్ తో మరింత మేర ధర రాబట్టుకునేందుకు ప్రభుత్వం త్వరలోనే బహిరంగ టెండర్లను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేయనుంది.