: హమాలీ ఉద్యోగాలకు పోటీపడుతున్న పోస్టుగ్రాడ్యుయేట్లు!


దేశంలో నిరుద్యోగ తీవ్రతకు అద్దంపట్టే ఘటన ఇది. ఐదో తరగతి అర్హత కూడా అవసరం లేని హమాలీ పోస్టులకు ఏకంగా ఎంఫిల్, పోస్టుగ్రాడ్యుయేట్లు దరఖాస్తు చేశారంటే నిరుద్యోగం యువతతో ఎలా అడుకుంటుందో అర్థం చేసుకోవచ్చు. మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఎంపీఎస్సీ) తాజాగా 5 హమాలీ(పోర్టర్) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 4వ తరగతి పాస్ అర్హతగా నిర్ణయించింది. అయితే ఈ పోస్టులకు అనూహ్యంగా 2500 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఐదుగురు ఎంఫిల్ చేసినవారు కాగా 250 మంది పోస్టుగ్రాడ్యుయేట్లు, 984 గ్రాడ్యుయేట్లు ఉన్నారు. విచిత్రం ఏంటంటే వీరిలో 177 మందే పది లోపు చదివిన వారు ఉండడం. హమాలీ ఉద్యోగాలకు ఎంపీఎస్సీ ఆగస్టులో నిర్వహించే రాతపరీక్షలో నాలుగో తరగతి పాస్ అయిన అభ్యర్థులతో కలిసి గ్రాడ్యుయేట్లు అందరూ పరీక్ష రాయనున్నారు. ఆ ఐదు పోస్టులు వీరిలో ఎవరికి దక్కుతాయో చూడాలి!

  • Loading...

More Telugu News