: మ్యాజిక్ చేయనున్న హృతిక్ రోషన్...మొహంజొదారో ట్రైలర్ విడుదల
బాలీవుడ్ లో హృతిక్ రోషన్ ది ప్రత్యేక చరిత్ర... చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికీ షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి స్టార్ హీరోలకు సమానమైన స్థాయిని అతితక్కువ వ్యవధిలో సంపాదించుకున్నాడు. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా హృతిక్ సినిమాను అభిమానులు వీక్షిస్తారు. గత సినిమాలు నిరాశపరచిన నేపథ్యంలో పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న 'మొహంజొదారో' సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. సుదీర్ఘ కాలం జరిగిన ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. పోస్టు ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్ర యూనిట్ ట్రైలర్ విడుదల చేసింది. ట్రైలర్ లో డాన్సర్ (ముకుంద ఫేమ్ పూజా హెగ్డె) తో యువకుడి (హృతిక్) ప్రేమ...సింధు నాగరికత, సంప్రదాయాలు, రాచరికం, సాహసాలు కలగలిసిన ట్రైలర్ ఆకట్టుకునేలా కనపడుతోంది. అభిమానులను ఈ ట్రైలర్ ఆకట్టుకునేలా కనిపిస్తోంది. కాగా, 'లగాన్', 'స్వదేశ్', 'జోథా అక్బర్' వంటి సినిమాలు రూపొందించిన అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకోగా, ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.