: 2న ఇఫ్తార్ విందు ఇవ్వనున్న ఆర్ఎస్ఎస్


రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇవ్వనుంది. ఆ సంస్థ విభాగమైన ముస్లిం రాష్ట్రీయ మంచ్(ఎంఆర్ఎం) జులై 2వ తేదీన పార్లమెంట్ భవనంలో ఇఫ్తార్ విందు ఇవ్వనుందని ఆర్ఎస్ఎస్ ప్రతినిధి ఇంద్రేష్ కుమార్ తెలిపారు. ఈ విందుకు పాకిస్థాన్ తో పాటు 140 దేశాల రాయబారులను ఆహ్వానించనున్నట్లు చెప్పారు. ఈ విందుకు ముస్లింలు, ముస్లిమేతర మేధావులు కూడా హాజరవుతారు. భారత్ లో అన్ని మతాల వారికి భద్రత ఉంటుందని చెప్పడమే ఈ విందు ఉద్దేశ్యమని ఎంఆర్ఎం చీఫ్ మహ్మద్ అఫ్జల్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News