: అందుకే, ఇంట్లో కూర్చుని వీడియో గేమ్స్ ఆడుకుంటున్నాను: విరాట్ కోహ్లీ
బయట వర్షం పడుతోంది, అందుకే ఇంట్లో కూర్చుని వీడియో గేమ్స్ ఆడుకుంటున్నానని టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ అన్నాడు. ఈ మేరకు ఒక ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా ఒక ఫొటోను కూడా పోస్ట్ చేశాడు. కాగా, ఆసియా కప్, టీ 20 ప్రపంచకప్, ఐపీఎల్-9 టోర్నమెంట్ లలో వరుస మ్యాచ్ లాడిన కోహ్లికి జింబాబ్వే పర్యటన నుంచి సెలక్టర్లు విశ్రాంతి నివ్వడంతో ఎంజాయ్ చేశాడు. జులై 21 నుంచి వెస్టిండీస్ పర్యటన నేపథ్యంలో నిన్నటి నుంచి మళ్లీ నెట్స్ లో ప్రాక్టీస్ కు దిగాడు. ఈరోజు వర్షం కురవడంతో తాను ఇంటికే పరిమితమయ్యానని, వీడియో గేమ్ ఆడుకుంటున్నానంటూ కోహ్లీ చేసిన ట్వీట్ ను అభిమానులు పంచుకున్నారు.