: జీహెచ్ఎంసీలో త్వరలో కొత్త సిబ్బంది నియామకం: మంత్రి కేటీఆర్


జీహెచ్ఎంసీలో త్వరలో కొత్త సిబ్బంది నియామకం జరుగుతుందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, యూనిఫైడ్ మెట్రో ట్రాన్స్ పోర్ట్ అథారిటీని మరింత బలోపేతం చేస్తామని, హైదరాబాద్ రోడ్ల నిర్మాణ, నిర్వహణ పద్ధతుల్లో మార్పులు తీసుకువస్తామని అన్నారు. జీహెచ్ఎంసీలో ఇన్నోవేషన్ సెల్ ఏర్పాటు చేస్తామని, ఎవరైనా సలహాలు ఇవ్వవచ్చని అన్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ను నియమించనున్నట్లు చెప్పారు. 221 ట్రాఫిక్ జంక్షన్లపై పోలీస్ యంత్రాంగంతో వచ్చే వారం సమావేశం కానున్నట్లు ఆయన చెప్పారు. పార్కింగ్ కాంప్లెక్స్ లు ప్రజలు ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకుంటామని, వాటి ద్వారా ఆదాయం వస్తుందని, ట్రాఫిక్ సమస్య తీరుతుందని అన్నారు. జీహెచ్ఎంసీలో 15 ఏళ్లు దాటిన చెత్త తరలింపు వాహనాలను తొలగిస్తామని, వాటి స్థానే కొత్త వాహనాలను ఆగస్టు 15లోగా అందజేస్తామని చెప్పారు. త్వరలో ఆస్తి పన్ను పెంచే అవకాశం కూడా ఉందని ఈ సందర్భంగా కేటీఆర్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News