: రెండు రికార్డులు సమం చేసిన శ్రాన్


హరారేలో జింబాబ్వేతో జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో అద్భుతమైన గణాంకాలు నమోదు చేసిన బరీందర్ శ్రాన్ రెండు రికార్డులు సమం చేశాడు. భారత పేస్ బౌలర్ బరిందర్ శ్రాన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ 20 అరంగేట్రంలో అద్భుతమైన గణాంకాలను నమోదు చేసిన భారత బౌలర్ గా రికార్డు నమోదు చేశాడు. నాలుగు ఓవర్లలో పది పరుగులకే నాలుగు వికెట్లు తీయడం ద్వారా గతంలో టీమిండియా స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా అరంగేట్రం సందర్భంగా నమోదు చేసిన నాలుగు వికెట్ల రికార్డును సవరించాడు. 2009లో బంగ్లాదేశ్ తో జరిగిన ఆ మ్యాచ్ లో నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన ఓజా 21 పరుగులిచ్చి, నాలుగు వికెట్లు తీశాడు. శ్రాన్ మాత్రం కేవలం 10 పరుగులే ఇచ్చి నాలుగు వికెట్లు తీయడం విశేషం. అలాగే టీ20 అరంగేట్ర బౌలర్ గా 2012లో ఐర్లాండ్ తో జరిగిన టీ20లో బంగ్లా బౌలర్ ఎలియస్ సన్నీ ఐదు వికెట్లు తీసి ప్రపంచ రికార్డు నెలకొల్పగా, అతని తరువాతి స్థానంలో శ్రాన్ నిలిచాడు. అదే ఏడాది అశోక్ దిండా శ్రీలంకతో జరిగిన టీ20 లో ఒకే ఓవర్ లో మూడు వికెట్లు తీశాడు. ఒకే ఓవర్ లో మూడు వికెట్లు తీయడం ద్వారా దీనిని కూడా శ్రాన్ సమం చేశాడు.

  • Loading...

More Telugu News