: విజయవాడలో సూపర్ ఫాస్ట్ రైలు ప్రారంభం
విజయవాడ - సికింద్రాబాద్ మధ్య ప్రవేశపెట్టిన ఇంటర్ సిటీ సూపర్ ఫాస్ట్ రైలు కొద్ది సేపటి క్రితం ప్రారంభించారు. విజయవాడ రైల్వేస్టేషన్ లో రైల్వే మంత్రి సురేశ్ ప్రభు, సీఎం చంద్రబాబు జెండా ఊపి దీనిని ప్రారంభించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, పలువురు నేతలు పాల్గొన్నారు. కాగా, వారంలో ఐదురోజుల పాటు రెండు రాష్ట్రాల మధ్య ఈ సూపర్ ఫాస్ట్ రైలు తిరగనుంది. ప్రయాణికులకు 5 ఏసీ బోగీలు, 8 స్లీపర్ క్లాస్ బోగీలు అందుబాటులో ఉన్నాయి. ప్రమాదం జరిగినప్పుడు ప్రాణనష్టం తగ్గించేలా బోగీల్లో ఏర్పాట్లు చేశారు. ఈ కొత్త రైలు సికింద్రాబాద్ లో ఉదయం 5.30 గంటలకు బయలుదేరి విజయవాడకు 11 గంటలకు చేరుకుంటుంది. సాయంత్రం 5.30 గంటలకు విజయవాడలో బయలుదేరి రాత్రి 11.10 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.