: హైకోర్టులో కేసీఆర్ కు ఊరట.. 2008 ఉప ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసులన్నీ కొట్టివేత


ఎన్నికల నియమావళి ఉల్లంఘన వ్యవహారానికి సంబంధించి కేసీఆర్ పై గతంలో నమోదైన కేసులన్నింటిని హైకోర్టు కొట్టివేసింది. 2008 ఉప ఎన్నికల్లో కార్యకర్తలు, పోలింగ్ ఏజెంట్ల సమావేశాల సందర్భంగా కేసీఆర్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ రిటర్నింగ్ అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో పలు పోలీస్ స్టేషన్లలో కేసీఆర్ పై కేసులు నమోదయ్యాయి. అయితే, ఈ కేసులన్నింటిని కొట్టివేయాలని కోరుతూ 2009లో హైకోర్టులో కేసీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని ఇప్పటికే పలుమార్లు విచారించిన ధర్మాసనం ఈరోజు మరోసారి విచారించింది. ఈ సందర్భంగా కేసీఆర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. వాదనలు విన్న ధర్మాసనం కేసీఆర్ పై నమోదైన కేసులన్నింటిని కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

  • Loading...

More Telugu News