: జింబాబ్వేకు చుక్కలు చూపించిన టీమిండియా ఓపెనర్లు...పది వికెట్ల విజయం


టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది. మొన్నటి ఓటమికి పది వికెట్ల విజయంతో ప్రతీకారం తీర్చుకుంది. జింబాబ్వే పర్యటనలో భాగంగా హరారేలో జరిగిన రెండో టీ20లో టాస్ గెలిచిన జింబాబ్వే మూర్ (31), వాలర్ (14), ట్రిపానో (11), చిబాబా (10), మసకద్జ (10) రాణించడంతో 9 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత ఓపెనర్లు జింబాబ్వేకు చుక్కలు చూపించారు. జింబాబ్వే బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా కేవలం 13.1 ఓవర్లలోనే 103 పరుగులతో లక్ష్యం సాధించి సత్తా చాటారు. ఇన్నింగ్స్ ను మందకొడిగా ప్రారంభించిన కేఎల్.రాహుల్ (47), మన్ దీప్ సింగ్ (52) నెమ్మదిగా జోరు పెంచారు. చెత్తబంతులను బౌండరీ లైన్ దాటిస్తూ ఎలాంటి ఒత్తిడి లేకుండా లక్ష్యం సాధించారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి 10 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసిన బరీందర్ శ్రాన్ నిలిచాడు.

  • Loading...

More Telugu News