: మీడియాకు భయపడి ప్రియురాలిని బాధపెడుతున్న టైగర్ ష్రాఫ్
బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ మీడియాకి భయపడి ఎప్పటికప్పుడు ప్రియురాలిని బాధపెడుతున్నాడు. 'హీరో పంతి', 'బాఘీ' సినిమాలతో ఆకట్టుకున్న టైగర్ ష్రాఫ్, 'లోఫర్' సినిమాతో టాలీవుడ్ ను పలకరించిన దిశా పటానీలు చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వీరు 'బేఫికరా' అనే ఆల్బమ్ లో నటిస్తున్నారు. ఈ ఆల్బమ్ లోని పాట చిత్రీకరణ పారిస్ లో జరుగుతోంది. ఇద్దరూ కలిసి వెళ్లాలని భావించి ముంబై ఎయిర్ పోర్టుకు వచ్చారు. మీడియా అక్కడ కనబడడంతో వెనక్కి వెళ్లిపోయిన టైగర్ మరో అరగంట తరువాత మళ్లీ ఎయిర్ పోర్టుకు వచ్చి, ఫ్లైట్ ఎక్కాడు. గత వారం వీరిద్దరూ డిన్నర్ చేసేందుకు ఓ రెస్టారెంట్ కు వెళ్లారు. అక్కడ కూడా మీడియా కనబడడంతో మీడియాను తప్పించుకునేందుకు దిశా పటానీని రెస్టారెంట్ లో ఒంటరిగా వదిలేసి, కారెక్కి వెళ్లిపోయాడు. కాసేపటి తరువాత దిశా పటానీ ఆటోలో ఇంటికి చేరుకుంది.