: బౌలర్లు భేష్...బ్యాట్స్ మన్ పని మిగిలింది...జింబాబ్వే 99/9


జింబాబ్వే సిరీస్ లో భాగంగా హరారేలో జరుగుతున్న రెండో టీ20లో భారత బౌలర్లు సత్తాచాటారు. తొలి వన్డేలో పరుగుల వరద పారించిన జింబాబ్వే బౌలర్లను బరీందర్ శ్రాన్, బుమ్రా వణికించారు. చక్కని లైన్ అండ్ లెంగ్త్ తో కట్టడి చేసి కనీసం వంద పరుగులు కూడా చేయనివ్వలేదు. దీంతో టీమిండియా బౌలర్లు స్థాయికి తగ్గ ఆటతీరు ప్రదర్శించారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన జింబాబ్వేకు చిబాబా (10), మసకద్జ (10) శుభారంభం ఇచ్చారు. అనంతరం మూర్ (31) అద్భుంగా ఆడాడు. సహచరులు వెనుదిరుగుతున్నా పట్టుదలను ప్రదర్శించి ఆకట్టుకున్నాడు. సికిందర్ రాజా (1), మొతుంబాడ్జి (0) విఫలం కాగా, వాలర్ (18), చిగుంబురా (8) ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. క్రీమర్ (4), మద్జివా (1) విఫలం కాగా, ట్రిపానో (11) చివర్లో మెరుపులు మెరిపించాడు. దీంతో జింబాబ్వే జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 99 పరుగులు చేసింది. దీంతో భారత్ విజయ లక్ష్యం 100 పరుగులు. భారత బౌలర్లలో కేవలం 10 పరుగులిచ్చిన బరీందర్ శ్రాన్ 4 వికెట్లు తీయగా, 3 వికెట్లు తీసి బుమ్రా ఆకట్టుకున్నాడు. చాహల్, కులకర్ణి చెరో వికెట్ తీసి వారికి సహకరించారు.

  • Loading...

More Telugu News