: కొడుకును హీరోగా పెట్టి తీసిన సినిమా విడుదలకు నోచుకోక నష్టాలు...ఆత్మహత్య చేసుకున్న తమిళ రాజకీయ నాయకుడి కుటుంబం
తమ కొడుకును హీరోగా పెట్టి సినిమా తీసి.. ఆ చిత్రం విడుదలకు నోచుకోకపోవడంతో నష్టాలు పాలైన తమిళ రాజకీయ నాయకుడు తన కుటుంబ సభ్యులతో పాటు ఆత్మహత్య చేసుకున్నాడు. విల్లుపురం జిల్లా దిండివనం సమీపంలోని పురంగరై గ్రామానికి చెందిన డీఎంకే నాయకుడు పొన కుమార్(45) తన కొడుకు దీన ను హీరోగా పెట్టి ‘కాదల్ జననం’ అనే చిత్రాన్ని ఆయన నిర్మించాడు. ఈ చిత్రం విడుదల కాకపోవడం... భారీగా నష్టం రావడంతో మనస్తాపం చెందిన పొనకుమార్ తన భార్య సుమతి, కూతురు షణ్ముగప్రియ, కుమారుడు దీనతో కలిసి ఇటీవల విషాహారం తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.