: సమాజ్ వాది పార్టీలోకి నాటి మాఫియా డాన్!
నాటి మాఫియా డాన్, రాజకీయ నాయకుడిగా మారిన ముక్తార్ అన్సారీ సమాజ్ వాది పార్టీ (ఎస్పీ)లో చేరనున్నారు. అంతేకాకుండా, ముక్తార్ సోదరుడు అఫ్జల్ అన్సారీ కూడా ఎస్పీలో చేరుతున్నట్లు సమాచారం. ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేశ్ యాదవ్ ను వీరిద్దరూ ఇప్పటికే కలిసినట్లు తెలుస్తోంది. కాగా, నేర చరిత్ర ఉన్న ముక్తార్ అన్సారీని ఎస్పీలో ఎందుకు చేర్చుకుంటున్నారంటూ పలువురు విమర్శిస్తున్నారు. అఖిలేశ్ యాదవ్ సమక్షంలోనే వీరిద్దరూ పార్టీలో చేరనుండటంపై బీజేపీ నేత విజయ్ బహదూర్ స్పందిస్తూ, వచ్చే ఎన్నికల్లో మళ్లీ విజయం సాధించాలనే లక్ష్యంతో ఉన్న సమాజ్ వాది పార్టీ తమ పార్టీలో ఎవరినైనా చేర్చుకుంటుందని విమర్శించారు.