: మార్కెట్లో హోండా సరికొత్త స్కూటర్ బైక్ 'నవీ'... ధర రూ. 45,827
నూరు శాతం భారత్ లో తయారైన సరికొత్త స్కూటర్ బైక్ 'నవీ'ని హోండా మోటార్ సైకిల్స్ ఇండియా లిమిటెడ్ మార్కెట్లోకి విడుదల చేసింది. గోవాలో జరిగిన ఓ కార్యక్రమంలో సంస్థ బైక్ ఆవిష్కరణ జరిగింది. దీని ధర రూ. 45,827 (ఆన్ రోడ్ - గోవా)గా వెల్లడించిన సంస్థ ప్రతినిధులు, భారత యువత అవసరాలను దృష్టిలో ఉంచుకుని దీన్ని తయారు చేసినట్టు వివరించారు. థర్డ్ జనరేషన్ హోండా యాక్టివాలో వాడిన 100 సీసీ ఇంజన్ పై దీన్ని తయారు చేశామని, 3.8 లీటర్ల ఇంధన కెపాసిటీ ఉంటుందని, లీటరుకు 60 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని, గేర్లు మార్చే అవసరం ఉండదని వివరించారు. గంటకు గరిష్ఠంగా 81 కిలోమీటర్ల వేగంతో దూసుకెళుతుందని పేర్కొన్నారు. 1.805 మీటర్ల పొడవు, 128.6 సెంటీమీటర్ల వీల్ బేస్ తో లభించే బైక్ బరువు 101 కిలోలు మాత్రమేనని వెల్లడించారు. హోండా ఈకో టెక్నాలజీ (హెచ్ఈటీ) ఆధారిత ఎయిర్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్ తో 7.83 బీహెచ్పీ పవర్ దీని ప్రత్యేకతని పేర్కొన్నారు.