: కాలిఫోర్నియా నదిలో కృష్ణా జిల్లా వాసి గల్లంతు
అమెరికాలోని కాలిఫోర్నియా వద్ద నదిలో కృష్ణా జిల్లా వాసి గల్లంతు అయ్యాడు. జగ్గయ్యపేట మండలం బండిపాలెంకు చెందిన పుట్టా నరేశ్ (24) కాలిఫోర్నియాలో ఎమ్మెస్ చదువుతున్నాడు. తన స్నేహితులతో కలిసి పడవలో షికారుకు వెళ్లినపుడు ఈ సంఘటన జరిగింది. నదిలో గల్లంతైన నరేశ్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.