: వాడు నా కొడుకన్న విషయం చాలా మందికి తెలీదు: అనిల్ కపూర్


బాలీవుడ్ లో త్వరలో అరంగేట్రం చేయనున్న హర్షవర్ధన్ కపూర్ తన కుమారుడున్న విషయం చాలా మందికి తెలియదని స్టార్ హీరో అనిల్ కపూర్ తెలిపారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనకు ఇద్దరే పిల్లలని, వాళ్లిద్దరూ కుమార్తెలే అని చాలా మంది అనుకుంటున్నారని, తనకు అబ్బాయి కూడా వున్న విషయం చాలా మందికి తెలియదని అన్నారు. తన కుమారుడు సొంతంగా ఎదగాలని భావించి, వాడి గురించి ఎప్పుడూ బహిరంగంగా మాట్లాడలేదని ఆయన తెలిపారు. అలాగే తన పిల్లలకు తాను అభిమాన నటుడ్ని కాదని చెప్పారు. కనీసం నాన్నను చూసి చాలా నేర్చుకోవాలి అని అనుకునే రకం కూడా కాదని అన్నారు. అంతెందుకు, తాను నటించిన చాలా సినిమాలను వారు చూడలేదని ఆయన చెప్పారు. కాగా, అనిల్ కపూర్ కుమార్తెలు సోనమ్ కపూర్ సినీ నటి కాగా, రియా కపూర్ నిర్మాతగా ఆకట్టుకుంది. కుమారుడు హర్షవర్థన్ కపూర్ 'మీర్జ్యా' సినిమాతో బాలీవుడ్ లో అరంగేట్రం చేయనున్నాడు.

  • Loading...

More Telugu News