: అధికారులు, సిబ్బందిపై మంత్రి దేవినేని ఆగ్రహం
వ్యవసాయ, అనుబంధ శాఖాధికారులు, సిబ్బందిపై మంత్రి దేవినేని ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ నగర పరిధిలోని గొల్లపూడి వద్ద నిర్వహించిన ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని దేవినేని ప్రారంభించారు. ఆయనతో పాటు కలెక్టర్ బాబు.ఎ, వ్యవసాయశాఖ సిబ్బంది పాల్గొన్నారు. అయితే, పొలాల్లో దిగకుండా రోడ్డుపైనే సిబ్బంది నిల్చున్నారంటూ దేవినేని మండిపడ్డారు. పొలంలోకి దిగితే తప్పా,రైతుల కష్టమేంటో తెలియదని మంత్రి అనడంతో అధికారులు, సిబ్బంది పొలంలోకి దిగి నాగలి పట్టారు. కాగా, ఏరువాక సందర్భంగా దేవినేని ఉమ పంచె కట్టి, తలకు పాగా చుట్టి నాగలి చేతపట్టారు.