: నన్ను అన్ని రకాలుగా ఆదుకున్న జిల్లా ఇది: సీఎం చంద్రబాబు


‘నన్ను అన్నిరకాలుగా ఆదుకున్న జిల్లా పశ్చిమగోదావరి జిల్లా’ అని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా చిట్టవరం ‘ఏరువాక’లో పాల్గొన్న అనంతరం ఆయన మాట్లాడుతూ, తనకు ఎంతో ప్రీతిపాత్రమైన జిల్లా పశ్చిమగోదావరి అని, కేంద్ర సాయంతో తప్పకుండా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని, భవిష్యత్తులో మూడో పంటకు కూడా నీళ్లు ఇచ్చే అవకాశం ఉందని, నదుల అనుసంధానంతో తాగునీటి కొరత ఉండదని అన్నారు. రైతులను అన్ని విధాలా ఆదుకుంటున్నామని, వ్యవసాయంలో వినూత్న పద్ధతుల్లో ముందుకెళ్లాలని సూచించారు. రెండు నెలలకొకసారి బ్యాంకర్లతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నామని, వ్యవసాయం చేసే వారికి సకాలంలో డబ్బు అందేలా చూడాలని బాబు అన్నారు. ఈ ఏడాది నుంచి ఈ-క్రాఫ్ విధానం అమలు చేయనున్నామని, పంట పొలాలకు గతంలో భూసార పరీక్షలు జరిగేవి కావని, భూసార పరీక్షల్లో దేశంలోనే రాష్ట్రం ముందంజలో ఉందంటూ చంద్రబాబు తన ప్రసంగాన్ని కొనసాగించారు.

  • Loading...

More Telugu News