: 25న చంద్రబాబే స్వయంగా అమరావతి రైతులకు ప్లాట్లు పంచుతారు: నారాయణ


భారీ వర్షాల కారణంగా నేడు నిలిచిపోయిన అమరావతి రైతుల ప్లాట్ల డ్రా, అప్పగింత కార్యక్రమాన్ని 25న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వయంగా నిర్వహిస్తారని మంత్రి నారాయణ వెల్లడించారు. అదే రోజున కనకదుర్గ వారధి నుంచి తుళ్లూరు వరకూ నది వెంబడి సీడ్యాక్సిస్ రోడ్డుకు శంకుస్థాపన జరుగుతుందని చెప్పారు. తాత్కాలిక సచివాలయంలో తక్కువ ధరలకు ఆహార పదార్థాలను అందించే అన్న క్యాంటీన్ ను ప్రారంభిస్తామని, అపై రైతులకు ప్లాట్ల పంపిణీ కార్యక్రమం చేపడతామని వివరించారు. కాగా, నేడు అమరావతి రైతులకు ప్లాట్ల పంపిణీ లాంఛనంగా ప్రారంభం కావాల్సి వున్నప్పటికీ, తుళ్లూరు ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో ఆటంకం ఏర్పడిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News