: విదేశీ పర్యటనకు బయలుదేరిన రాహుల్ గాంధీ
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కొద్ది రోజులు విదేశాలకు వెళ్లనున్నారు. ఎక్కడికి వెళ్లేది, ఎప్పుడు వెళ్లేదీ తెలియజేయని ఆయన, తన విదేశీ ప్రయాణాన్ని ఖరారు చేశారు. "స్వల్ప పర్యటన నిమిత్తం దేశాన్ని వీడి కొన్ని రోజులు వెళుతున్నాను. నా పుట్టిన రోజు సందర్భంగా అభినందనలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు" అని తన ట్విట్టర్ ఖాతా ద్వారా రాహుల్ వెల్లడించారు. రాహుల్ నిన్న తన 46వ పుట్టిన రోజును జరుపుకున్న సంగతి తెలిసిందే. గత సంవత్సరం ఆయన 56 రోజుల పాటు ఎక్కడికి వెళ్లారన్న విషయం తెలియకుండా విదేశీ పర్యటన చేసి వచ్చారు. ఇప్పుడు మరోసారి అదే తరహా పర్యటనకు ఆయన వెళ్లనున్నారని తెలుస్తోంది.