: స్వర్ణ దేవాలయంపై దాడి దృశ్యాలు వెలుగులోకి!... నెట్ లో అరుదైన వీడియో!


అమృత్ సర్ లోని సిక్కుల పవిత్ర ఆలయం స్వర్ణ దేవాలయంలో బింద్రన్ వాలే నేతృత్వంలోని ఖలిస్థాన్ తీవ్రవాదులను అదుపు చేసేందుకు ఇందిరా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ‘ఆపరేషన్ బ్లూ స్టార్’ పేరిట సైన్యాన్ని రంగంలోకి దింపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి వార్తలు, ఫొటోలు తప్పించి వీడియో ఇప్పటిదాకా విడుదల కాలేదు. అయితే తాజాగా నిన్న జాతీయ మీడియాలో ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో ప్రత్యక్షమైంది. 5.18 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో ఆలయంలోని పలు నిర్మాణాల నుంచి మంటలు రావడం, బుల్లెట్ల శబ్దాలు, లొంగిపోతున్న ఖలిస్థాన్ కార్యకర్తలు, క్షతగాత్రులను మోసుకొస్తున్న భద్రతా దళాలు, ఆలయ ప్రాకారం నుంచే తుపాకులు ఎక్కుపెట్టిన పోలీసులు, ఖలిస్థాన్ నేతలు ఆలయంలో దాచిన తుపాకులు, మందుగుండు సామగ్రి తదితరాలు కనిపిస్తున్నాయి. నాటి ఘటనకు సంబంధించిన ఈ వీడియో నిజమైనదేనని పలు వార్తా సంస్థలు ప్రకటించాయి.

  • Loading...

More Telugu News