: కేజ్రీ ఇంటి ముందు హైటెన్షన్!... ఢిల్లీ సీఎం తప్పుడు ఆరోపణలకు నిరసనగా బీజేపీ ఎమ్మెల్యే దీక్ష


దేశ రాజధాని ఢిల్లీలో ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటి ముందు నిన్న సాయంత్రం నుంచి హైటెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. ఎన్ఎండీసీ ఉద్యోగి ఎంఎం ఖాన్ హత్య కేసుకు సంబంధించి కేజ్రీవాల్ చేసిన ఆరోపణలకు నిరసనగా బీజేపీ ఎమ్మెల్యే మహేశ్ గిర్రీ నిన్న సాయంత్రం కేజ్రీ ఇంటి ముందు దీక్షకు దిగారు. రాత్రి దీక్షకు కాస్తంత విరమణ ఇచ్చిన గిర్రీ... కాసేపటి క్రితం మరోమారు కేజ్రీ ఇంటి ముందు దీక్షకు దిగారు. ఎంఎం ఖాన్ హత్య కేసులో తన ప్రమేయముందంటూ అసత్య ఆరోపణలు చేసిన కేజ్రీ క్షమాపణ చెప్పేదాకా దీక్ష విరమించేది లేదని ఆయన తేల్చిచెప్పారు. ఇదిలా ఉంటే... ఈ దీక్షపై సమాచారం అందుకున్న బీజేపీ ఫైర్ బ్రాండ్, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి మరికాసేపట్లో గిర్రీకి మద్దతు తెలపనున్నారు. ఈ క్రమంలో కేజ్రీ ఇంటి వద్దకు చేరుకుంటున్న బీజేపీ శ్రేణుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో అక్కడ హైటెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది.

  • Loading...

More Telugu News