: కాబూల్ దాడి తాలిబన్ల పనే!... ఘటనలో 14 మంది దుర్మరణం
ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ లో నేటి ఉదయం పేట్రేగిన ఉగ్రవాదులు తాలిబన్ ఉగ్రవాద సంస్థకు చెందిన వారేనట. ఈ మేరకు దాడి జరిగిన కొద్దిసేపటికే... సదరు దాడి చేసింది తామేనంటూ తాలిబన్ ప్రకటించుకుంది. విదేశీ పర్యాటకులు ప్రయాణిస్తున్న బస్సును లక్ష్యంగా చేసుకుని తాలిబన్లు పేల్చిన బాంబు గురి తప్పి ఆ దేశ ఉద్యోగులు ప్రయాణిస్తున్న మినీ బస్సును పేల్చేసింది. ఈ దాడిలో ఇప్పటిదాకా 14 మంది మరణించగా, మరో 20 మందికి గాయాలయ్యాయి. అమెరికా వైమానిక దాడులకు నిరసనగానే ఈ దాడికి పాల్పడినట్లు తాలిబన్లు ప్రకటించారు.