: శంషాబాదులో బూచోడు!... చిన్నారులను ఎత్తుకెళ్లేందుకు యత్నించిన వ్యక్తికి బడితె పూజ!
హైదరాబాదు శివారు శంషాబాదులో నేటి ఉదయం ఓ బూచోడు కలకలం రేపాడు. రోడ్డుపై మాటు వేసి పాఠశాలలకు వెళుతున్న చిన్నారులకు చాక్లెట్ ఆశ చూపుతూ వారిని కిడ్నాప్ చేసేందుకు యత్నించాడు. అయితే అతడి యత్నం ఫలించేలోగానే... జనం అతడి పన్నాగాన్ని కనిపెట్టారు. వెనువెంటనే అతడిని బంధించి బడితె పూజ చేశారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.